Tuesday, June 9, 2009

తెలంగాణ ఎందుకో తెలియదు, ఐనా వ్యతిరేకిస్తాం ..!

గోపాలరాజు గారూ,

మీరు కూడా తెలంగాణ కు 'వ్యతిరేకిని కాను ' అన్నారు. మీ వ్యాఖ్య మొత్తం చదివితే అర్థం అవుతుంది మీరు వ్యతిరేకి ఔనో కాదో. దానికి పెద్ద రిసెర్చి అవసరం లెదనుకుంటా. మీరు 'నల్లగొండ కు అటొడ్డు ' వారు కాబట్టి మీ అభిప్రాయం సహజమైనదే.

తెలంగాణ అనేది చిన్నపిల్లల విషయం అని నేను చెప్పలేదు. అది మి వ్యక్తిగత అపోహ. తెలంగాణ చిన్న విషయం కాదు. ఐతే అలా అని భారత దేశం లోనే ఒక రాష్ట్రం గాఏర్పడదం పెద్ద కష్టమైనది కూడా కాదు. 400 మంది చావాల్సినంత పెద్ద విషయమూ కాదు. 50 ఏండ్లు పోరాడవలసినంత పెద్దవిషయం కూడా కాదు. ఏ వర్గ ప్రయోజనాల కోసమో కాని తెలంగాణ మాత్రం రాదు. భారత దేశం లో తెలంగాణ కన్న 18 చిన్న రాష్ట్రాలుండొచ్చు. అవి ఎలా ఏర్పడ్డాయి. మరి తెలంగాణ అడిగినప్పుడు మాట్రం వై యస్ చెప్పినట్టు "అదేమన్నా చిన్నపిల్లల విషయమా " అనే చచ్చు డైలాగ్ ఎందుకువస్తుందో కూడా మీరే చెప్పాలి.

నాకొక్కటి అర్థం ఐందీ. మీరు "అటొడ్డు "వారు కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు కాని రాష్ట్రాలు ఏర్పడుతాయొ కనీస అవగహన మీకు లేదు. రెండు రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు ఒక "ఆర్బిట్రేషన్ కమిటీ" ని ఏర్పాటు చేస్తారు. ఆ ఆర్బిట్రేషన్ కమీటీ ఆధ్వర్యంలోనే అన్న రకాల పంపిణీ లు జరుగుతాయి. స్మవత్సరానికి లక్ష కోట్ల బద్జెట్ రాష్ట్రానిది.
మీరు చెప్పినట్టు గొప్ప గొప్ప "ఇంఫ్రాస్త్రక్చర్ " లేమి నిర్మించరు. ఒకటి మీరు గుర్తించండి రాష్ట్రాల ఏర్పాటు అనేది పరిపాలనలో మాట్రమే చీలిక. ఎక్కడి అధికారులు, ఆఫీసులు అక్కన్నే ఉంటాయి.

ప్రతినెలా కేంద్ర ప్రభుత్వం జీతాలు ఇవ్వాలి అని మీరెక్కడ కనుక్కున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు జీతాలు ఇవ్వాలి. ఎక్కడి యంత్రాంగం అక్కడ ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఎప్పుడు వచ్చే ఆదాయం వస్తూనే ఉంటుంది. అలాగే జీతాళు చెల్లించడం కూడా జరుగుతుంది. జీతాల చెప్చెల్లింపులూ గత్ర అన్నీ ఆర్బిట్రేషన్ కమిటి ఆధ్వర్యం లోనే జరుగుతాయి. జీతా జీతాలు చెల్లించడం ఎలా ఆనే ఒక తలా తోక లేని ప్రశ్న. ఏదో కొత్త డేశం ఏర్పడుతున్నంత హంగాం కొందరిక్ పరిజ్ణాన లేమి మాత్రమే.

గోపాల రాజుగారు,

దయచేసి ఆవేశపడొద్దు. కొంచెం నీళ్లు తాగ్ రిప్లయ్ రాయండి తొందరేమీ లేదు.
నేను హైదరాబాదు గురించి ప్రస్తావించింది హైదరాబాదులో చాల అభివ్రుద్ది జరిగింది అన్న మాటకు సమాధానం గా వాడాను. హైదరాభాదు లో జరిగిన అభివృద్ది ప్రజాకోసం జరిగిందా.. కొందరి వ్యాపారం అభివృద్ది కోసం జరిగిందా అన్నదాని మీద చర్చిద్దాం అన్నాను. ఇది తప్పేమి కాదు కదా. ఇప్పుడు మీరేమో మీ ఊరు కూడ అంతే అభివృద్ది జరిగింది అనంటున్నాౠ. మీదే ఊరో నాకు తెలియదు కాణి మీ ఊరు ఇంతగా అభివృఇద్ది చెందదం ఆనందంగా ఉంది.

తెలంగాణ వస్తే కొత్తగా ఏం అభివృద్ది జరుగుతుంది అన్నావు. అంటే కనీసం తెలంగాణ కోరుతున్నావారు ఏ అంశాలకోసం కోరుతున్నారొ కూడ నువ్వు ఇంతకుముందు తెలుసుకోలేదు అంటే ఐనా నువ్వు కూడా తెలంగాణ ను వ్యతిరేకిస్తున్నవంటే నే అర్థన్మ్ అవుతుంది నువ్వు "ఏ ఒడ్దు వారి " ప్రయోజనాలకోసం గొంతువిప్పావో.
అవినీతి అనేది ఈ దేశ రాజకీయాల్లోంచి పోవడం ఇప్పట్లో అసాధ్యం. అది వెళ్లిన నాడు రామరారాజ్యం వస్తుంది అని అప్పటిదాక తెలంగాణ వద్దు అనడం ఒక కుంటి సాకు. తెలంగాణ అడిగేది తమ నేలను తాము పాలించుకుంటామని. ఇది ఎవరికో వ్యతిరేకం కాదు. తెలంగాణ ఎందుకో తెలియదు, కారణాలు తెలియకున్నా వ్యతిరేకిస్తాం అనే అజ్ణానుల కోసం కొన్ని లింక్ ఇస్తున్నాను. ఇవి చదివిన తర్వాత అంశాల వారీగా మళ్లీ ఒక్కొక్కదాని గురించి మాట్లాడుదాం.
ఇయ్యాల రాయలసీమ లో అన్ని ప్రాజెక్ట్ లు కడుతున్నారు అంటే దానర్థం నువ్వు చెప్పినట్టు అక్కడి నాYఅకులంతా కడిగిన ముత్యాలనా..? అన్ని కాకమ్మ కథలు. అధికారం ఎక్కడ ఉంటే అక్కడికి అన్ని వస్తాయి. నువ్వు చెప్పిన ఆదర్ష రాజ్యం ఇంకొ 2000 ఎండ్లైనా రాదు. అలా వచ్చినా ఒక ప్రాజెక్ట్ ను ఎక్కడ కట్టాలని సీయెం అనుకుంటే దానికి అనుకులం గా నివేదికనిస్తారు ఇంజనీర్లు. దిన్ని అవినీతి అని ఎవడు ప్రూవ్ చేస్తాడు. సొల్లు కొట్టమంటే చాలా చెప్పొచ్చు. ఐతే నిజ జీవితం లో ఎదాధ్యం అన్నదే ప్రశ్న.


ఎందుకు తెలంగాణ రాష్ట్రం..?
http://www.telangana.org/Papers/Article10.pdf

నీటిపారుదల వ్యవసాయం:
http://www.telangana.org/Papers/article3.asp

విద్య:
http://www.telangana.org/Papers/article4.asp

ఉద్యోగాలు:
http://www.telangana.org/Papers/article9.asp
http://www.telangana.org/Papers/article6.asp

Sunday, June 7, 2009

నిజమే మీరు చౌకబారే...!!

[for his same post & peplies at http://naasaahityam.blogspot.com/2008/03/blog-post_17.html ]

మీరు అవతలి వారిని కన్విన్సు చెయ్యలేకపోయారు. అందుకు మీరు పెట్టిన వాదనలేమిటి. నిరాధారమైన వాగుడు తప్ప ఒక్క సహేతుకమైన విషయం చెప్పండి. మాట్లాడుదాం. అంతే కాని ఏమీ మాట్లాడకుండానే ఏదో మాట్లాడాను అనుకోవడం కరెక్ట్ కాదు. ఇప్పుడు చెప్పండి ఏమిటా ' హేతుబద్ద ' విషయం. మాట్లాడుదాం. మీరు ఏ ఒక్క విషయం కూడా ఆధారాలతో మాట్లాడలేదు. కేవలం మీ ఊహలకు రెండు కాదు నూట ఇరవై రెక్కల్ని కట్టి వదిలారు తప్ప దేనికీ ఒక విష్లేషణ కాని సంఖ్యా పరమైన ఆధారం కాని లేదు.

ఇక నేను మిమ్మల్ని కవిన్సు చెయ్యలేకపోవడం గురించి. చెప్పండి అది ఏ విషయమో. ఇప్పటివరకు చెప్పిన ఆధారాలు మిమ్మల్ని కన్విన్సు చెయ్యలేకపోతే చెప్పండి మరికొన్ని సమర్పిస్తా.

ఇలా కన్విన్సు చెయ్యలేకపోవడనికి మీరు చెప్పిన కారణాలు రెండు. ఒకటి నేనూ ఆలోచించే విధానానికి చరిత్రను ఆధారాలను అన్వయించుకున్నా అని. మీరు మల్లి చెప్పండి మీరు చెప్పినదానికి సరి పడు ఆధారాలను, చరిత్రను మీరు అన్వయింపచేసుకున్నా పరవాలేదు. అన్వయించుకొని వాటిని ఆధారాలుగానే చర్చించాలి. అలాకాకుండా నీ మాట నీదే నా మాట నాదే అని అనుకుంటే ఈ ప్రపంచం లోని ఏ చర్చకు అర్థం లేదు. మీరు ఒక్క ఆధారం చూపకుండా.. నేను చెప్పిన వాటిని కొట్టిపారేయడం మీ విజ్ణతకే వదిలేస్తున్నా.

చరిత్రను నేను అన్వయింపచేసుకున్న అని కాదు. మీరు నిరాధారమైన పస లేని వాదనలు చేస్తున్నారు. నేనేదైన ఆధారం తో మాట్లాడితే అవి నా ఆధారలంతావ్. ఇది కేవలం మీ అసమర్తత ను కప్పిపుచ్చుకోవడం మాత్రమే.
తెలుగు వాళ్లు కొట్టుకుచావడం అనేది మీ అభిప్రాయం కావొచ్చు. కొందరు రాజకీయనాయకులతో, స్వార్థ పరులైన పెట్టుబడిదారులతో, తెలంగాణ ప్రజల సంస్కృతిని అవమనించిన వారితో తెలంగాణ ప్రజలు ఈ రోజు పోరాదుతున్నారు. దాన్ని సాటి తెలుగు ప్రజలతో అని తాడేపల్లి గారు భావిస్తే ముందు వారు సాటి తెలుగు ప్రజల్నదరూ తెలంగాణ ప్రజల పట్ల ఆలా చెస్తున్నారా అన్నది వారే చెప్పాలి. ఎదో లగడపాటి, రామోజి, జీవీకే, లాంటి దొంగలతోనే తెలంగాణ ప్రజల కొట్లాట. ఆంధ్రా నుంది వచ్చి కూకట్ పల్లి ల్ ఇడ్లీ బండి పెట్టుకున్న రామారావు గారు మా శత్రువు కాదు. తాడేపల్లి గారు మీ సంకుచిత మనస్తత్వాన్ని వేరేవాళ్లకు రుద్దకండి. లక్షల మందితో తెలంగాణ సభలు ప్రతిచోట జరిగాయి. ఎప్పుడూ ఎక్కడా చిన్నగొడవకూడా కాళేదే. ప్రజలెప్పుడు శంతినే కోరుకుంటారు. కొనదరు మాత్రమే తమ అజ్ణానం తో అతిగా ఊహించుకుంటారు. కాని వాస్తవంగా టీఆరెస్ లో ఉన్న తెలంగాణ వాదులు కాని, టీఆరెస్ ను వ్యతిరేకించే తెలంగాణ వాదులు కాని హింస ను కోరుకోవట్లేదు. 'చరిత్రకారులు ' తాడేపల్లి గారికెందుకు అలా అంపిస్తుందో వారు చెప్పాలి.

వేర్పాటువాదం తో శత్రుత్వం పెరుగుతుందా..? అలాంటప్పుడు మద్రాస్ వాళ్లతో కలిసి ఉండే 'ప్రేమతో ' గొదవలు పరిష్కరించుకోవచ్చు కదా. తెలుగు వాడి ఆత్మగౌర్వాన్ని దెబ్బతీస్తున్నారని తమిళుల నుండి ఎందుకు వేరు పడ్డారు. పరిపాలన లో సౌలభ్యత కోసం, ప్రాంతాల భాషా సంస్కృతుల రక్షణ కోసం వారు తమ ప్రాంతాన్ని పలించుకుంటాం అనడం తప్పా. సరిగ్గా ఇవే ప్రయోజనాల కోసం కదా ఆంధ్ర వాళ్లు మద్రాస్ నుండి విడిపోయింది. మీరు చేస్తే శృంగారం మేము చేస్తే వ్యభిచారామా..!! ఇదేనా మీరు చెప్పే న్యాయం చరిత్రకారులు గారూ. మీరు రాష్ట్రగా ఏర్పడితే ఒక రష్ట్రం తయరైనట్టు. అదే మేము ఒక రాష్ట్రం గా ఏర్పడితే ' పాకిస్తాన్ ' లాగా ఒక దేశం ఐనట్టా. మీరు దయచేసి ఒక మానసిక నిపుణున్ని కలవండి. ఎందుకంటే మీ మేలు కోసం మీ అసంబద్ద రాతలు చదివేవారి మేలుకోసం అది ఇప్పుడు అవసరం.

ప్రాక్టికల్ గైన్స్ కోసం వెతుకుతున్నా అన్నారు కదా వెతకండి. ఏడేళ్ల మీ పరిశొధన లో మీరు కనిపెట్టింది సున్నా. ఇంక ముందు మీరేదో కనిపెడతారని నేను అనుకోవట్లెదు. అక్కడేమన్నా ఉంటే కదా మీరు కనుక్కునేది. మీరు ఎంత తవ్వుకుంటే అంత బయటపడేది తెలంగాణ ఎందుకు కావాలో తెల్పే అంశాలే. సరె. మీ ప్రయత్నం చేస్తా అన్నరు మంచిదే చెయ్యండి. నేను అప్పుడే దాణి గురించి మాట్లాడుతా. ఎవరి నీళ్లు ఎటు మళ్లాయో, జీ ఓ 610 ని కాదని ఎన్ని వేలమంది ఇక్కడ అక్రమంగా తిష్ట వేసారో అన్ని తవ్వండి. బాగుంటుంది.

ఇప్పటిదాక జరిగిన కల్చరల్ డెవలప్మెంట్ చాలు. తెలంగాణ యాస సినిమాల్లో విలన్ ఐంది. జోకర్ ఐంది. నిస్సిగ్గుగా ఎలా మాట్లాడగలం ఇంకా ఎదో సాధిస్తామనీ. We are never interested in u'r telugu nation, We are telugu speaking people of Indian Nation. There is no other thought in it. Stop u'r psycho trics here itself. Dear 'historian' it is not only a fundamental lack of emotional integration but also lack of equal development, misapprpriation of decissions. If its only lack of emotional integration & can be achieved with 'Pationece & Wisdom ' why didn't u try to get it in madras state. How many years u were pationt after getting independance with madras state. you have no right to preach such stories with telangana people. may be its not late for u. as u r not the effected. It is the interest of Telangana people to be a state. We laid down 400 lives to be separate state with in india. Its not difficult for us to expect what is the volume of benefits to the Andhra & Seema rulers. (I said only rulers, not common). Telangana people knows how to respect the slang & culture of other indians though they are facing the supression from other telugu people in the name of 'standard ' language. Mr. taaDEpalli need not be panic because of his narrow thinking. We are asking to segregate the adminitsration not the people. We are indians. bharata mata ki jai.

Saturday, June 6, 2009

7 ఇయర్స్ ఇన్ ద ఇండస్ట్రీ

(follow the same link as earlier)
తాడేపల్లి గారు కింది పొస్త్ లో రాసిన కామెంట్ కు ఇచ్చిన రిప్లయ్ కి నా సమాధానం.

కేసీఆర్ వల్లే తెలంగాణ ఉద్యమం వచ్చిందనీ అందరికీ తెలుసు అంటున్నారు తాడేపల్లి గారు. ఎవరా అందరూ. తెలంగాణ ఉద్యమం కెసీఆర్ చెన్నారెడ్డి ల కన్నా ముందు నుంచి వుందనీ, వాళ్లు కేవలం ఉద్యమన్ని ఎన్నికల్లో ముందుకు తీసుకొని వచ్చిన రాజకీయనాయకులని తెలియని మూర్ఖులు ఎవరూ ఉండరని నేను అనుకుంటా. ఏమో ఈ ఉద్దెశ్యం తో మన తాడేపల్లి గారు మాత్రమే ఉన్నారనుకుంటా. ఎందుకంటే 'ఏడేల్లు పరిశోదన ' చేస్తేనే ఇది కనుక్కొవడం సాధ్యం అవుతుంది.

జస్టిస్ ఫజల్ అలి కమీషన్ 50's లోనే చెప్పారు తెలంగాణ ఆంధ్రా విలీనానికి తెలంగాణ ప్రజలు సంసిద్ధం గా లేరు అని. ఆరోజు చ్దెన్నారెడ్డి తెలంగాణ ఉద్యమంలోకి రాకన్నా ముందూనుండి ఉన్నవాళ్లున్నారు. మీకు వీలుంటే హైదరాబదు వచ్చినప్పుడు నన్ను కలిస్తే నేను వారి వద్దకు తీసుకెళ్తాను. ఎందుకంటే మీలాంటి 'సాహిత్య కారులు ' ఇలాంటివి తెలుసుకోవాలి. నిజంగా తెలుసుకోవాలనుకుంటేనే. లేదు ఏదో మీకు తోచిన రాతలు రాస్తాను. ఎవరన్నా ఇది నిజం కాదు అంటే 'నీకేం తెల్సు 7 ఇయర్స్ ఇన్ ద ఇండస్ట్రీ ' అని నాకిష్టం వచ్చిన కథలు చెప్తా అంటే నాకేం అభ్యంతరం లేదు.
'హేతు బద్దత ' గురించి మాట్లాడుతున్నారు మన తాడేపల్లి గారు. బహూశా ఈ పదం బాగుందని వాడినట్టున్నారు. ఎందుకంటే వారు మాట్లాడిన వాటిలో దేనికీ 'హేతుబద్దత ' ఉండదు. వారు ఎదైనా హేతుబద్దత గల అంశం గురించి మాట్లాడదాం అంటే గౌరవ బ్లాగర్స్ ముందు మాట్లాడడానికి నేను రెడీ. ఇక హేతుబద్దతే ప్రాతిపదిక. తాడేపల్లి గారూ ఏమంటారూ..?

Friday, June 5, 2009

నిద్ర నటిస్తున్న తాడేపల్లి గారికి..

తాడేపల్లి గారు వ్రాసిన లింక్ లో ఉన్న టపా కు మొదటి విడత జవాబులు. ముందు లింక్ లో ఉన్నది చదివి తర్వాత నేనూ రాసింది చదవండి

http://naasaahityam.blogspot.com/2008/03/blog-post_17.html


తెలంగాణ ప్రజలు తమ రాష్ట్రం తమకు కావాలంటే తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం గారి బట్టలెందుకు ఊడుతున్నాయో సాటి భారతీయులముందు సిగ్గుతో ఎందుకు తల దించుకుంటున్నారో వారే చెప్పాలి. ఏ 'ఆకు తొల్చు పురుగుల ' నిర్వాకం వల్ల ఆంధ్రా మద్రాసు రాష్ట్రం నుండి విదివడిండొ సదరు రచయిత గారు గుర్తు తెచ్చుకుంటే బాగుండును. భాషా ప్రయుక్త రాష్ట్రం కొందరికి నచ్చిందని అందరికి నచ్చాలని లేదుకదా. ఒకరికి భాష ఒక్కతి గా ఒక రాష్ట్రం గా ఉండొచ్చు. మరి కొందరికి భాషకన్నా బతుకే ముఖ్యం కావొచ్చు. చరిత్రను తాను అధ్యనం చేసాను తనకన్నీ తెలుసు అని చెప్పిన శ్రీమాన్ తాడేపల్లి గారు ఏ పుస్తకం లో తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కేసీఆర్ తో పుట్టింది అని రాసారో చెప్పాలి. తనకు తెలిసిందే సగం సగం. ఇంకా దానికి 'అందరికీ తెలుసు ' అనే కవరింగ్ ఎందుకో. అంతిమంగా సాధ్యపడదని మిమ్మల్ని మీరు ఓదార్చుకునె ప్రయత్నాలు చేస్తూనే ఉండండి. 200 యేళ్ల తర్వాతే స్వతంత్రం వచ్చింది. కొంచెం ముందు వెనక.. ప్రజల మనోభిష్టం నెరవేరాల్సిందే. ఐతే దొంగ రాజకీయ నాయకుల (అన్ని పార్టీల్లో ఉన్నరు) కుయుక్తులకు తాత్కాలికంగా తెలంగాణ వాయిదా పడ్డా ప్రజాభీష్టం నెరవేరుతుంది. ఒకమాట మీరన్నారు "సోదరుణ్ణి బద్నామ్ చేస్తే తామూ అతనితో సమానంగా బద్నామ్ అవుతామని". నిజమే చెప్పాౠ. ఐతే తెలంగాణ యాసను బతుకునూ కించపరిచేటప్పుడు సోదరులకు ఇది గుర్తుకెందుకు రాదో. అట్లతద్దె గురించి పుస్తకాల్లో ఉంటుంది. బతుకమ్మ పండుగ గురించి ఎందుకు ఉండదో. ఆంధ్ర రాష్ట్రం మద్రాస్ నుండి విడిపోయి కర్నూల్ రాజధానిగా అంధ్ర రాష్ట్రం ఏర్పడిందని ఉంటుంది. ఆ తర్వాత హైదరాబాదు రాజధానిగా ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడిందని ఉంటుంది. కాని కర్నూల్ రాజధాని గా ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు హైదరాబాదు రాజదాని గా హైదరాబాదు రాష్ట్రం ఉందని ఎందుకు వ్రాయారో '7 సంవత్సరాలు చరిత్ర అధ్యయనం' చేసిన శ్రీమాన్ తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం గారే చెప్పాలి.


మన జాతి అన్నారు. ఏమిటది. తెలుగు జాతా..? భారత జాతా..? తెలంగాణ ప్రజలు తము భారత జాతికి చెందిన వారమనీ భావిస్తారు. తమ మాతృభాష తెలుగుగా గౌరవిస్తారు. భారత దేశం లో ఉన్నప్పటికీ తమది తెలుగు జాతి అనేవారికి భారతీయత వారి జాతి ఔనో కాదో వారే చెప్పాలి.

మతం కారణం గా ఒక జాతి ఏర్పడుతుంది అని చెప్పిన జిన్నా కు, భాష కారణం గా జాతి ఏర్పడుతుంది అని చెప్పిన మీకూ ఏమిటి తేడా..? ఎవరు ఈ 'ఆకు తొల్చు పురుగులొ ' మీకు అర్థం అయ్యిందనుకుంటా..!!


తెలుగు 'జాతి ' హితానికి మీరేమి పేటెంట్ తీసుకోనక్కర్లేదు సోదరులారా. జరిగిన హితం చాలు. ఎవరి నేలను వారే పాలించుకొని తమ నిర్ణయాలను తీసుకోగలిగితే దాన్ని మించిన హితం ఏదీ ఉండదు. 'స్టేట్స్ మాన్ ' గురించి మాట్లాడుతున్నారా. ఏ స్టేట్స్ మాన్స్... అంధ్రా కు ముఖ్యమంత్రి ఇస్తే తెలంగాణ కు ఉపముఖ్యమంత్రి ఇవ్వాలి అని రాసుకున్న 'పెద్ద మనుశుల ' ఒప్పందాన్ని దానిమీది సిరా తడి ఆరకముందే బుట్ట్దాఖలా చేసి ఉప ముఖ్య పదవిని ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడ్డ మర్నాడే రద్దు చేసిన స్టేట్స్ మెన్ గురించేనా నువ్ చెప్పేది. ఇక మీ స్టేట్స్ మెన్ రాజ్కీయాల్లో వేలు పెట్టడమే వద్దు. 50 ఏండ్ల చరిత్రను కళ్లారా చూసిన సగటు తెలంగానీయుడే స్టేట్స్ మాన్.

సమైక్య వాదాన్ని బూతుమాటగా మేము మాఋచలేదు. మీరు మార్చారు. మేము కేవలం పరిపాలనే వేరు చెయ్మంటున్నాం. ప్రజల్ని కాదు. 400 మందిని చంపి మరీ ఇంకా 'మనం అంతా అన్నదమ్ములం ' అని చిలక పలుకులు పలకడమే చెప్తూంది ఎవరి నైజం ఏమిటొ. మేము మాది ఒక జాతి అని మమ్మల్ని మేము మిగతా భారతీయులనుండి వేరు చేసుకోవడం లేదు. భారతీయులుగా కలిసి ఉందాం అంటున్నాం.
ఇప్పూడు చెప్పండి ఎవరు విచ్చిన్నకారులు..! మీరా మేమా.