Friday, June 5, 2009

నిద్ర నటిస్తున్న తాడేపల్లి గారికి..

తాడేపల్లి గారు వ్రాసిన లింక్ లో ఉన్న టపా కు మొదటి విడత జవాబులు. ముందు లింక్ లో ఉన్నది చదివి తర్వాత నేనూ రాసింది చదవండి

http://naasaahityam.blogspot.com/2008/03/blog-post_17.html


తెలంగాణ ప్రజలు తమ రాష్ట్రం తమకు కావాలంటే తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం గారి బట్టలెందుకు ఊడుతున్నాయో సాటి భారతీయులముందు సిగ్గుతో ఎందుకు తల దించుకుంటున్నారో వారే చెప్పాలి. ఏ 'ఆకు తొల్చు పురుగుల ' నిర్వాకం వల్ల ఆంధ్రా మద్రాసు రాష్ట్రం నుండి విదివడిండొ సదరు రచయిత గారు గుర్తు తెచ్చుకుంటే బాగుండును. భాషా ప్రయుక్త రాష్ట్రం కొందరికి నచ్చిందని అందరికి నచ్చాలని లేదుకదా. ఒకరికి భాష ఒక్కతి గా ఒక రాష్ట్రం గా ఉండొచ్చు. మరి కొందరికి భాషకన్నా బతుకే ముఖ్యం కావొచ్చు. చరిత్రను తాను అధ్యనం చేసాను తనకన్నీ తెలుసు అని చెప్పిన శ్రీమాన్ తాడేపల్లి గారు ఏ పుస్తకం లో తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కేసీఆర్ తో పుట్టింది అని రాసారో చెప్పాలి. తనకు తెలిసిందే సగం సగం. ఇంకా దానికి 'అందరికీ తెలుసు ' అనే కవరింగ్ ఎందుకో. అంతిమంగా సాధ్యపడదని మిమ్మల్ని మీరు ఓదార్చుకునె ప్రయత్నాలు చేస్తూనే ఉండండి. 200 యేళ్ల తర్వాతే స్వతంత్రం వచ్చింది. కొంచెం ముందు వెనక.. ప్రజల మనోభిష్టం నెరవేరాల్సిందే. ఐతే దొంగ రాజకీయ నాయకుల (అన్ని పార్టీల్లో ఉన్నరు) కుయుక్తులకు తాత్కాలికంగా తెలంగాణ వాయిదా పడ్డా ప్రజాభీష్టం నెరవేరుతుంది. ఒకమాట మీరన్నారు "సోదరుణ్ణి బద్నామ్ చేస్తే తామూ అతనితో సమానంగా బద్నామ్ అవుతామని". నిజమే చెప్పాౠ. ఐతే తెలంగాణ యాసను బతుకునూ కించపరిచేటప్పుడు సోదరులకు ఇది గుర్తుకెందుకు రాదో. అట్లతద్దె గురించి పుస్తకాల్లో ఉంటుంది. బతుకమ్మ పండుగ గురించి ఎందుకు ఉండదో. ఆంధ్ర రాష్ట్రం మద్రాస్ నుండి విడిపోయి కర్నూల్ రాజధానిగా అంధ్ర రాష్ట్రం ఏర్పడిందని ఉంటుంది. ఆ తర్వాత హైదరాబాదు రాజధానిగా ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడిందని ఉంటుంది. కాని కర్నూల్ రాజధాని గా ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు హైదరాబాదు రాజదాని గా హైదరాబాదు రాష్ట్రం ఉందని ఎందుకు వ్రాయారో '7 సంవత్సరాలు చరిత్ర అధ్యయనం' చేసిన శ్రీమాన్ తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం గారే చెప్పాలి.


మన జాతి అన్నారు. ఏమిటది. తెలుగు జాతా..? భారత జాతా..? తెలంగాణ ప్రజలు తము భారత జాతికి చెందిన వారమనీ భావిస్తారు. తమ మాతృభాష తెలుగుగా గౌరవిస్తారు. భారత దేశం లో ఉన్నప్పటికీ తమది తెలుగు జాతి అనేవారికి భారతీయత వారి జాతి ఔనో కాదో వారే చెప్పాలి.

మతం కారణం గా ఒక జాతి ఏర్పడుతుంది అని చెప్పిన జిన్నా కు, భాష కారణం గా జాతి ఏర్పడుతుంది అని చెప్పిన మీకూ ఏమిటి తేడా..? ఎవరు ఈ 'ఆకు తొల్చు పురుగులొ ' మీకు అర్థం అయ్యిందనుకుంటా..!!


తెలుగు 'జాతి ' హితానికి మీరేమి పేటెంట్ తీసుకోనక్కర్లేదు సోదరులారా. జరిగిన హితం చాలు. ఎవరి నేలను వారే పాలించుకొని తమ నిర్ణయాలను తీసుకోగలిగితే దాన్ని మించిన హితం ఏదీ ఉండదు. 'స్టేట్స్ మాన్ ' గురించి మాట్లాడుతున్నారా. ఏ స్టేట్స్ మాన్స్... అంధ్రా కు ముఖ్యమంత్రి ఇస్తే తెలంగాణ కు ఉపముఖ్యమంత్రి ఇవ్వాలి అని రాసుకున్న 'పెద్ద మనుశుల ' ఒప్పందాన్ని దానిమీది సిరా తడి ఆరకముందే బుట్ట్దాఖలా చేసి ఉప ముఖ్య పదవిని ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడ్డ మర్నాడే రద్దు చేసిన స్టేట్స్ మెన్ గురించేనా నువ్ చెప్పేది. ఇక మీ స్టేట్స్ మెన్ రాజ్కీయాల్లో వేలు పెట్టడమే వద్దు. 50 ఏండ్ల చరిత్రను కళ్లారా చూసిన సగటు తెలంగానీయుడే స్టేట్స్ మాన్.

సమైక్య వాదాన్ని బూతుమాటగా మేము మాఋచలేదు. మీరు మార్చారు. మేము కేవలం పరిపాలనే వేరు చెయ్మంటున్నాం. ప్రజల్ని కాదు. 400 మందిని చంపి మరీ ఇంకా 'మనం అంతా అన్నదమ్ములం ' అని చిలక పలుకులు పలకడమే చెప్తూంది ఎవరి నైజం ఏమిటొ. మేము మాది ఒక జాతి అని మమ్మల్ని మేము మిగతా భారతీయులనుండి వేరు చేసుకోవడం లేదు. భారతీయులుగా కలిసి ఉందాం అంటున్నాం.
ఇప్పూడు చెప్పండి ఎవరు విచ్చిన్నకారులు..! మీరా మేమా.

1 comment:

  1. తాడెపల్లి గారి వైఖరి విచిత్రంగా అనిపిస్తుంది తెలంగాణ పై.(కనీసం వికేంద్రీకరణలొ భాగంగా పరిపాలన సౌలభ్యం కొరకైన ఒప్పుకొక లేకపోతున్నరెందుకో? ఆదిపత్య ధోరనంటె ఇదేనేమో అనిపిస్తుంది)
    ఆంధ్రాకు, తెలంగాణాకు చాలా తేడా ఉన్నది.
    ఆంధ్రా పెత్తందార్ల వల్ల తెలంగాణ దోపిడికి గురైనది.
    ఒక విద్యార్ధిగా, ఉద్యోగిగా నేను అనుభవించాను ఆంధ్రావాళ్ల ఆధిపత్యం.
    తెలంగాణ ఆర్ధికంగా వెనకకు నెట్టబదింది.
    ఆనాటి బ్రిటిష్ తెల్ల దొరలకు ఈ ఆంధ్ర దళారులకు తేడా ఏమి లేదు.

    తెలంగాణ దొరలను పట్టణాలకు తరిమింది. కారంచెడులు లేవు, చుండూరులు లేవు. కులవివక్ష లేదు. పులివెందులలు లేదు, జమ్మలమడుగులు లేవు. ఫ్యాక్షన్ లేదు.
    ఆంధ్రలో వ్యాపార సంస్కృతి ఉన్నది. తెలంగానలొ త్యాగాల సంస్కృతి ఉన్నది.
    తెలంగాణ ప్రజలకు "సత్యం" అబద్ధాలు , "కృషీ" మోసాలు తెలియవు.
    కాని ఇప్పుడు ఆంధ్ర, రాయలసీమ పెత్తందార్లు వారి కుల రాజకీయాలను, ఫ్యాక్షన్ రాజకీయాలను తెలంగాణకు అంటిస్తున్నారు.
    తెలంగాణ ఉనికిని దెబ్బ తీస్తున్నారు
    ఏరకంగా చూసినా ఈ రెండు ప్రాంతాలకు పోలిక లేదు.
    విడి పోవడం తప్పక జరుగుతుంది. జరగాలి.
    సమతలం

    ReplyDelete