Saturday, June 6, 2009

7 ఇయర్స్ ఇన్ ద ఇండస్ట్రీ

(follow the same link as earlier)
తాడేపల్లి గారు కింది పొస్త్ లో రాసిన కామెంట్ కు ఇచ్చిన రిప్లయ్ కి నా సమాధానం.

కేసీఆర్ వల్లే తెలంగాణ ఉద్యమం వచ్చిందనీ అందరికీ తెలుసు అంటున్నారు తాడేపల్లి గారు. ఎవరా అందరూ. తెలంగాణ ఉద్యమం కెసీఆర్ చెన్నారెడ్డి ల కన్నా ముందు నుంచి వుందనీ, వాళ్లు కేవలం ఉద్యమన్ని ఎన్నికల్లో ముందుకు తీసుకొని వచ్చిన రాజకీయనాయకులని తెలియని మూర్ఖులు ఎవరూ ఉండరని నేను అనుకుంటా. ఏమో ఈ ఉద్దెశ్యం తో మన తాడేపల్లి గారు మాత్రమే ఉన్నారనుకుంటా. ఎందుకంటే 'ఏడేల్లు పరిశోదన ' చేస్తేనే ఇది కనుక్కొవడం సాధ్యం అవుతుంది.

జస్టిస్ ఫజల్ అలి కమీషన్ 50's లోనే చెప్పారు తెలంగాణ ఆంధ్రా విలీనానికి తెలంగాణ ప్రజలు సంసిద్ధం గా లేరు అని. ఆరోజు చ్దెన్నారెడ్డి తెలంగాణ ఉద్యమంలోకి రాకన్నా ముందూనుండి ఉన్నవాళ్లున్నారు. మీకు వీలుంటే హైదరాబదు వచ్చినప్పుడు నన్ను కలిస్తే నేను వారి వద్దకు తీసుకెళ్తాను. ఎందుకంటే మీలాంటి 'సాహిత్య కారులు ' ఇలాంటివి తెలుసుకోవాలి. నిజంగా తెలుసుకోవాలనుకుంటేనే. లేదు ఏదో మీకు తోచిన రాతలు రాస్తాను. ఎవరన్నా ఇది నిజం కాదు అంటే 'నీకేం తెల్సు 7 ఇయర్స్ ఇన్ ద ఇండస్ట్రీ ' అని నాకిష్టం వచ్చిన కథలు చెప్తా అంటే నాకేం అభ్యంతరం లేదు.
'హేతు బద్దత ' గురించి మాట్లాడుతున్నారు మన తాడేపల్లి గారు. బహూశా ఈ పదం బాగుందని వాడినట్టున్నారు. ఎందుకంటే వారు మాట్లాడిన వాటిలో దేనికీ 'హేతుబద్దత ' ఉండదు. వారు ఎదైనా హేతుబద్దత గల అంశం గురించి మాట్లాడదాం అంటే గౌరవ బ్లాగర్స్ ముందు మాట్లాడడానికి నేను రెడీ. ఇక హేతుబద్దతే ప్రాతిపదిక. తాడేపల్లి గారూ ఏమంటారూ..?

No comments:

Post a Comment