Tuesday, June 9, 2009

తెలంగాణ ఎందుకో తెలియదు, ఐనా వ్యతిరేకిస్తాం ..!

గోపాలరాజు గారూ,

మీరు కూడా తెలంగాణ కు 'వ్యతిరేకిని కాను ' అన్నారు. మీ వ్యాఖ్య మొత్తం చదివితే అర్థం అవుతుంది మీరు వ్యతిరేకి ఔనో కాదో. దానికి పెద్ద రిసెర్చి అవసరం లెదనుకుంటా. మీరు 'నల్లగొండ కు అటొడ్డు ' వారు కాబట్టి మీ అభిప్రాయం సహజమైనదే.

తెలంగాణ అనేది చిన్నపిల్లల విషయం అని నేను చెప్పలేదు. అది మి వ్యక్తిగత అపోహ. తెలంగాణ చిన్న విషయం కాదు. ఐతే అలా అని భారత దేశం లోనే ఒక రాష్ట్రం గాఏర్పడదం పెద్ద కష్టమైనది కూడా కాదు. 400 మంది చావాల్సినంత పెద్ద విషయమూ కాదు. 50 ఏండ్లు పోరాడవలసినంత పెద్దవిషయం కూడా కాదు. ఏ వర్గ ప్రయోజనాల కోసమో కాని తెలంగాణ మాత్రం రాదు. భారత దేశం లో తెలంగాణ కన్న 18 చిన్న రాష్ట్రాలుండొచ్చు. అవి ఎలా ఏర్పడ్డాయి. మరి తెలంగాణ అడిగినప్పుడు మాట్రం వై యస్ చెప్పినట్టు "అదేమన్నా చిన్నపిల్లల విషయమా " అనే చచ్చు డైలాగ్ ఎందుకువస్తుందో కూడా మీరే చెప్పాలి.

నాకొక్కటి అర్థం ఐందీ. మీరు "అటొడ్డు "వారు కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు కాని రాష్ట్రాలు ఏర్పడుతాయొ కనీస అవగహన మీకు లేదు. రెండు రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు ఒక "ఆర్బిట్రేషన్ కమిటీ" ని ఏర్పాటు చేస్తారు. ఆ ఆర్బిట్రేషన్ కమీటీ ఆధ్వర్యంలోనే అన్న రకాల పంపిణీ లు జరుగుతాయి. స్మవత్సరానికి లక్ష కోట్ల బద్జెట్ రాష్ట్రానిది.
మీరు చెప్పినట్టు గొప్ప గొప్ప "ఇంఫ్రాస్త్రక్చర్ " లేమి నిర్మించరు. ఒకటి మీరు గుర్తించండి రాష్ట్రాల ఏర్పాటు అనేది పరిపాలనలో మాట్రమే చీలిక. ఎక్కడి అధికారులు, ఆఫీసులు అక్కన్నే ఉంటాయి.

ప్రతినెలా కేంద్ర ప్రభుత్వం జీతాలు ఇవ్వాలి అని మీరెక్కడ కనుక్కున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు జీతాలు ఇవ్వాలి. ఎక్కడి యంత్రాంగం అక్కడ ఉన్నప్పుడు ప్రభుత్వానికి ఎప్పుడు వచ్చే ఆదాయం వస్తూనే ఉంటుంది. అలాగే జీతాళు చెల్లించడం కూడా జరుగుతుంది. జీతాల చెప్చెల్లింపులూ గత్ర అన్నీ ఆర్బిట్రేషన్ కమిటి ఆధ్వర్యం లోనే జరుగుతాయి. జీతా జీతాలు చెల్లించడం ఎలా ఆనే ఒక తలా తోక లేని ప్రశ్న. ఏదో కొత్త డేశం ఏర్పడుతున్నంత హంగాం కొందరిక్ పరిజ్ణాన లేమి మాత్రమే.

గోపాల రాజుగారు,

దయచేసి ఆవేశపడొద్దు. కొంచెం నీళ్లు తాగ్ రిప్లయ్ రాయండి తొందరేమీ లేదు.
నేను హైదరాబాదు గురించి ప్రస్తావించింది హైదరాబాదులో చాల అభివ్రుద్ది జరిగింది అన్న మాటకు సమాధానం గా వాడాను. హైదరాభాదు లో జరిగిన అభివృద్ది ప్రజాకోసం జరిగిందా.. కొందరి వ్యాపారం అభివృద్ది కోసం జరిగిందా అన్నదాని మీద చర్చిద్దాం అన్నాను. ఇది తప్పేమి కాదు కదా. ఇప్పుడు మీరేమో మీ ఊరు కూడ అంతే అభివృద్ది జరిగింది అనంటున్నాౠ. మీదే ఊరో నాకు తెలియదు కాణి మీ ఊరు ఇంతగా అభివృఇద్ది చెందదం ఆనందంగా ఉంది.

తెలంగాణ వస్తే కొత్తగా ఏం అభివృద్ది జరుగుతుంది అన్నావు. అంటే కనీసం తెలంగాణ కోరుతున్నావారు ఏ అంశాలకోసం కోరుతున్నారొ కూడ నువ్వు ఇంతకుముందు తెలుసుకోలేదు అంటే ఐనా నువ్వు కూడా తెలంగాణ ను వ్యతిరేకిస్తున్నవంటే నే అర్థన్మ్ అవుతుంది నువ్వు "ఏ ఒడ్దు వారి " ప్రయోజనాలకోసం గొంతువిప్పావో.
అవినీతి అనేది ఈ దేశ రాజకీయాల్లోంచి పోవడం ఇప్పట్లో అసాధ్యం. అది వెళ్లిన నాడు రామరారాజ్యం వస్తుంది అని అప్పటిదాక తెలంగాణ వద్దు అనడం ఒక కుంటి సాకు. తెలంగాణ అడిగేది తమ నేలను తాము పాలించుకుంటామని. ఇది ఎవరికో వ్యతిరేకం కాదు. తెలంగాణ ఎందుకో తెలియదు, కారణాలు తెలియకున్నా వ్యతిరేకిస్తాం అనే అజ్ణానుల కోసం కొన్ని లింక్ ఇస్తున్నాను. ఇవి చదివిన తర్వాత అంశాల వారీగా మళ్లీ ఒక్కొక్కదాని గురించి మాట్లాడుదాం.
ఇయ్యాల రాయలసీమ లో అన్ని ప్రాజెక్ట్ లు కడుతున్నారు అంటే దానర్థం నువ్వు చెప్పినట్టు అక్కడి నాYఅకులంతా కడిగిన ముత్యాలనా..? అన్ని కాకమ్మ కథలు. అధికారం ఎక్కడ ఉంటే అక్కడికి అన్ని వస్తాయి. నువ్వు చెప్పిన ఆదర్ష రాజ్యం ఇంకొ 2000 ఎండ్లైనా రాదు. అలా వచ్చినా ఒక ప్రాజెక్ట్ ను ఎక్కడ కట్టాలని సీయెం అనుకుంటే దానికి అనుకులం గా నివేదికనిస్తారు ఇంజనీర్లు. దిన్ని అవినీతి అని ఎవడు ప్రూవ్ చేస్తాడు. సొల్లు కొట్టమంటే చాలా చెప్పొచ్చు. ఐతే నిజ జీవితం లో ఎదాధ్యం అన్నదే ప్రశ్న.


ఎందుకు తెలంగాణ రాష్ట్రం..?
http://www.telangana.org/Papers/Article10.pdf

నీటిపారుదల వ్యవసాయం:
http://www.telangana.org/Papers/article3.asp

విద్య:
http://www.telangana.org/Papers/article4.asp

ఉద్యోగాలు:
http://www.telangana.org/Papers/article9.asp
http://www.telangana.org/Papers/article6.asp

No comments:

Post a Comment